Vizianagaram: ఆ ఐదు గ్రామాలంటే కరోనాకు హడల్‌

Andhra Pradesh: జిల్లాలో ఏడాదిగా క‌రోనా ఆన‌వాళ్లు లేని గ్రామాలు * గ్రామల్లో పక్కాగా నిబంధనల అమలు

Update: 2021-05-19 09:33 GMT

విజయనగరం జిల్లాలోని కరోనా రహిత గ్రామం 

Vizianagaram: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు ఆ వూళ్ళంటే చచ్చేంత భయం. అత్యధిక భద్రతా ఏర్పాట్లు ఉండే అమెరికా శ్వేతసౌధంలోకి సైతం విజయవంతంగా అడుగుపెట్టగలిగిన వైరస్‌ కి ఆ ఊళ్ళలో కాలుమోపటం సాధ్యం కాలేదు. కరోనాకే సవాల్‌ విసిరి ఆ ఐదు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి.

ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా విజయనగరం జిల్లాలోని గిరిజన గ్రామాలలో మాత్రం అడుగు పెట్టలేకపోయింది. గుమ్మలక్ష్మీపురం మండలంలోని రాయఘడజమ్ము, మొరంగూడ కురుపాం మండలంలోని పల్లంబారిడి, సంతోషపురంలతో పాటు ఎస్ కోట మండలంలోని దారపర్తి గ్రామల్లో కరోనా ఆటలు సాగలేదు.

ఆ గ్రామీణప్రాంత ప్రజల జీవనశైలి కరోనా నుంచి వారికి రక్షణ కల్పిస్తుంది. పొద్దున లేచిన్పటి నుంచి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుండటం, మంచి ఆహారంను భాగం చేసుకోవడం, కొవిడ్‌ నిబంధనలను పక్కాగా అమలుచేయడం వంటి కారణాలతో తమ గ్రామాలకు కరోనా మహమ్మారిని రాకుండా అడ్డుకున్నారు. గ్రామం నుంచి బయటకు.. బయటి నుంచి గ్రామంలోకి ఎలాంటి రాకపోకలు లేకుండా అందరూ జాగ్రత్తపడుతున్నారు.

మొత్తంగా ఈ గ్రామస్తులు జీవన విధానాలే వారికి రక్షగా నిలుస్తున్నాయనటంలో సందేహం లేదు. వారిది ఏ విధమైన ఆందోళనలు, వత్తిడులు లేని ప్రశాంత జీవనం. ప్రభుత్వం మార్గదర్శకాలను తూచ తప్పకుండా పాటించటం వంటి చర్యల కారణంగా కరోనా వారి దరిచేరలేదు.

Full View


Tags:    

Similar News