YSR Matsyakara Bharosa: మత్స్యకారుల ఖాతాల్లోకి నేరుగా రూ.10వేలు జమచేసిన సీఎం

YSR Matsyakara Bharosa: ఏపీలో కరోనా విజృంభణ సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు కొనసాగుతోంది.

Update: 2021-05-18 07:56 GMT

జగన్ (ఫైల్ ఇమేజ్ )

YSR Matsyakara Bharosa: ఏపీలో కరోనా విజృంభణ సమయంలోనూ సంక్షేమ పథకాల అమలు కొనసాగుతోంది. వరుసగా మూడో ఏడాది వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను క్యాంప్‌ కార్యాలయంలో విడుదల చేశారు సీఎం జగన్‌. ఈ పథకం ద్వారా నేరుగా మత్స్యకారుల ఖాతాల్లోకి 10వేల నగదు జమ చేశారు. లక్షా 19వేల 875 మత్స్యకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. దీని కోసం రాష్ట్రం 119కోట్ల 88 లక్షలను ఖర్చు చేసింది. చేపలవేట నిషేధ సమయంలో ఏటా మత్స్యకార కుటుంబానికి 10వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు సీఎం జగన్.

రాష్ట్రంలోని పేదవాడి అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. వివక్ష, అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ అన్ని పథకాలు చేరువయ్యేలా.. వాలంటీర్‌ వ్యవస్థను స్థాపించామన్నారు. మత్స్యకార కుటుంబాలకు చేస్తున్న అందిస్తున్న 10వేల సాయం.. ఈ విపత్కర సమయంలో వారి కుటుంబాలను ఆదుకుంటుందని ఆశిస్తున్నానని జగన్‌ చెప్పారు. టీడీపీ హయాంలో డీజిల్ సబ్సిడీ మాటలకే పరిమితమైందన్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తున్నామన్న సీఎం జగన్‌.. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. 8 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామని, 100కు పైగా ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు సీఎం జగన్.

Tags:    

Similar News