ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం
*గవర్నర్, సీఎం చేతులమీదుగా అవార్డుల ప్రదానం *59 అవార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం
Andhra Pradesh: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్, వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయవాడ ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి, ఉత్తమ సేవలందించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
2021 సంవత్సరానికి గాను మొత్తం 59 అవార్డులను గవర్నర్ హరిచందన్, సీఎం జగన్ చేతుల మీదుగా ఇవ్వనున్నారు. 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, 30 వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డుల ప్రదానం జరగనుంది. 9 సంస్థలకు అలాగే వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి 11 అవార్డులు ఇవ్వనున్నారు.
కళలు, సంస్కృతికి 20 అవార్డులు, సాహిత్యం-7, జర్నలిజం-6, కొవిడ్ సమయంలో సేవలందించిన ప్రభుత్వ వైద్య సిబ్బందికి-6 అవార్డులు ఇవ్వనున్నారు. నగదు పురస్కారంతో పాటు మెమొంటో, మెడల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.