YSR Jayanthi Celebrations: రేపు, ఎల్లుండి కడపలో సిఎం జగన్!

YSR Jayanthi Celebrations: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రద్ధాంజలి ఘటించేందుకు 7,8 తేదీల్లో కడప వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు.

Update: 2020-07-06 02:15 GMT
YS Jagan (File Photo)

YSR Jayanthi Celebrations: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రద్ధాంజలి ఘటించేందుకు 7,8 తేదీల్లో కడప వెళ్లేందుకు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పాటు కడప పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ నెల 7, 8 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటించనున్నారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు వెళ్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎం అదనపు పీఎస్‌ కె.నాగేశ్వరరెడ్డి ఆదివారం విడుదల చేశారు. షెడ్యూల్‌ ఇలా..

► 7వ తేదీ మ.3.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం బయల్దేరి గన్నవరం విమానాశ్రయం చేరుకుని.. అక్కడి నుంచి విమానంలో కడపకు బయల్దేరుతారు.

► సాయంత్రం కడప విమానాశ్రయంలో దిగి.. హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకుంటారు. రాత్రికి ఇడుపులపాయ అతిథిగృహంలో బస చేస్తారు.

​​​​​​​► 8వ తేదీ ఉదయం ఇడుపులపాయలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తారు.

​​​​​​​► అనంతరం వైఎస్సార్‌ సర్కిల్, ఆర్‌.కె.వ్యాలీ వద్ద ఆర్‌జీయూకేటీకి చేరుకుని కొత్త భవన సముదాయానికి ప్రారంభోత్సవం.. 3 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

​​​​​​​► ఆ తర్వాత ఇడుపులపాయ అతిథి గృహానికి వెళ్తారు. మధ్యాహ్నం కడప విమానాశ్రయానికి వెళ్లి అక్కడి∙నుంచి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.   


Tags:    

Similar News