YSR Housing Scheme: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా.. కోర్టు వ్యవహారం తేలకపోవడంతో నిర్ణయం

YSR Housing Scheme: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది.

Update: 2020-08-13 03:22 GMT
YSR Housing Scheme

YSR Housing Scheme: ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. కోర్టు వ్యవహారం తేలకపోవడంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎప్పుడు పంపిణీ జరుగుతుందనే దానిపై మరోసారి ప్రకటిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. ఏపీలో జూలై 8వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 15కు వాయిదా వేస్తున్నట్టు అధికారులు గతంలో ప్రకటించారు. అయితే.. ఆగస్ట్ 15న కూడా ఇళ్ల పంపిణీ కార్యక్రమం ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. ప్రభుత్వం తాజా ప్రకటనతో ఈ విషయం స్పష్టమైంది.

ఆగస్ట్ 15న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇళ్ల పట్టాల కేటాయింపులో వైసీపీ సర్కార్ అక్రమాలకు పాల్పడిందంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ ఇంకా పూర్తి కాలేదు. దీంతో.. కోర్టు కేసులు తేలకపోవడంతో ఇళ్ల పట్టాల పంపిణీని వైసీపీ ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు జరగనుందో త్వరలో ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది

మొదటి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల పట్టాలను పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి జగన్. వైజాగ్, కర్నూల్, నెల్లూరు జిల్లాల్లో మొదటి దశలో చేపట్టబోయే ఇళ్ల సంఖ్యను పెంచేలా చూడాలని సీఎం చూడాలన్నారు. నిర్దేశిత డిజైన్‌లో భాగంగా పేదలకు నిర్మించబోయే ఇళ్లలో అందిస్తున్న సదుపాయాలు బెడ్‌ రూం, కిచెన్, లివింగ్‌ రూం, టాయిలెట్, వరండా సహా అన్ని సదుపాయాలు ఉండేట్లు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంటి నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు, నాణ్యతా ప్రమాణాలు పాటించి,.. పేదవాడిపై ఒక్క రూపాయి భారం కాకుండా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈ భారీ కార్యక్రమాన్ని చేపడుతున్న ఈ కార్యక్రమం, అత్యంత పారదర్శకంగా, నాణ్యతతో నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

గవర్నమెంట్ ఇచ్చే ఇళ్లు అంటే నాసిరకం అనే భావన పొగొట్టి.. నాణ్యతతో పనిచేస్తుందనే పేరు రావాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలు చేపడుతున్నందున.. అయా కాలనీల్లో మౌలిక సదుపాయాలకల్పనపైనా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాటు గత ప్రభుత్వం పేదలకు పెట్టిన ఇళ్లబకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా ఈ చెల్లింపులు సకాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Tags:    

Similar News