ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కు పలువురు నేతల నివాళి!

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు (63) బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని..

Update: 2020-09-17 05:04 GMT

తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు (63) బుధవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నివాళులు అర్పించారు. ఢిల్లీలోని ఏపీభవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో బల్లి దుర్గాప్రసాద్ సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , సత్యవతి, గోరంట్ల మాధవ్ , పోచ బ్రహ్మానందరెడ్డి , లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్య రామి రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ , తలారి రంగయ్య అలాగే ఏపీ భవన్ ఉన్నతాధికారులు అభయ త్రిపాటి, భావన సక్సేనా, రమణారెడ్డి లు దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బల్లి దుర్గాప్రసాద్ తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని.. 28 ఏళ్లకే రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా గెలిచారని.. ప్రతిసారి తన ఆశీస్సులు తీసుకునేవారని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు..

ఆయన మరణం కుటుంబానికే కాదు, వ్యక్తిగతంగా తనకు కూడా లోటని ఆయన అన్నారు. అలాగే బల్లి దుర్గాప్రసాద్ ఏదైనా భోళా గా మాట్లాడే మనిషని.. నిరంతరం పేద ప్రజల కష్టాలను తీర్చడం కోసం పరితపించేవారని.. ఆయన అకాల మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఇక సహచర ఎంపీ దుర్గా ప్రసాద్ మరణం తమని ఎంతో బాధించిందన్నారు అనకాపల్లి ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ఆమె అన్నారు. ఇదిలావుంటే ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురికావడంతో దుర్గాప్రసాద్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దాంతో మూడువారాల పాటు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు.. కరోనా నెగిటివ్‌ గా నిర్ధారణ అయినా.. దుర్గాప్రసాద్ గుండెపోటుతో మరణించారని ఆసుపత్రివర్గాలు తెలిపాయి. 

Tags:    

Similar News