ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేఖ వాణి వినిపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణ రాజుకు జగన్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి రఘురామకృష్ణ రాజుకు ఉద్వాసన పలికింది. రఘురామకృష్ణ రాజు స్థానంలో వైసీపీ ఎంపీ బాలశౌరికి అవకాశం కల్పించింది. దీంతో ఇంతకాలం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ కి చైర్మన్ గా వ్యవహరించిన రఘురామకృష్ణరాజు ఆ పదవి కోల్పోయినట్లైంది. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని లోక్ సభ ఒక ప్రకటనలో తెలిపింది.