YSR Book Pdf File Circulated On Social media: 'నాలో.. నాతో.. వైఎస్సార్‌' పుస్తకం వాట్సాప్‌లో వైరల్.. షేర్ చేస్తే చర్యలు తప్పవు!

Ysr Book Pdf File Circulated On Social Media: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ స్వయంగా ‘నాలో.. నాతో.. వైఎస్సార్‌’ అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే

Update: 2020-07-11 15:18 GMT

Ysr Book Pdf File Circulated On Social Media: దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ స్వయంగా 'నాలో.. నాతో.. వైఎస్సార్‌' అనే పుస్తకాన్ని రచించిన సంగతి తెలిసిందే... ఈ పుస్తాకాన్ని తాజాగా వైఎస్ 71వ జయంతి సందర్భంగా ఈ నెల 8వ తేదీన అయన తనయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలో ఆవిష్కరించారు. అయితే ఈ పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా తెలియడంతో దీనిపైన టీటీడీ చైర్మన్‌, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.

'నాలో.. నాతో.. వైఎస్సార్‌'' పుస్తకం పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందని, ఇది మా దృష్టికి వచ్చిందని, అయితే దీనికి పుస్తకానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఎమెస్కో పబ్లికేషన్స్ అచ్చువేసిన పుస్తకమే అసలైన పుస్తకమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఇలా సర్క్యులేట్‌ చేసేవారి పైన కచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే దీనిపైన రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసినట్లుగా వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

ఇక 'నాలో.. నాతో.. వైఎస్సార్‌' పుస్తకం విషయానికి వచ్చేసరికి వైఎస్సార్‌ మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారంగా ఈ పుస్తకాన్ని రచించారు వైఎస్ విజయమ్మ. దివంగత నేత గురించి ప్రజలు ఎం అనుకుంటున్నారో తెలుసుకొని, అంతేకాకుండా అయన గురించి ప్రజలకి తెలియని కొన్ని విషయాలని తెలిపేందుకు ఈ పుస్తకాన్ని రచించినట్లుగా ఆమె వెల్లడించారు.

వైఎస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైఎస్సార్‌ ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా మెలిగేవారో వైఎస్ విజయమ్మ ఇందులో వివరించారు. 

Full View


Tags:    

Similar News