YS Sharmila Tweet On Ap Govt : జూలై 8న పేదవాడి దశ తిరిగే రోజు..
YS Sharmila Tweet On Ap Govt : ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల పంపిణీపై వైఎస్ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు.
YS Sharmila Tweet On Ap Govt: ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల పంపిణీపై వైఎస్ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల స్పందించారు. ఈనెల 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఏపీ ప్రభుత్వం నిరు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'జులై 8 న పేదవాడి దశ తిరిగే రోజు, ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ' అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలం వద్దే జులై 8న పట్టాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 30 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. ఇళ్ల కేటాయింపులో భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి మీద అధికారులు నిశితంగా పర్యవేక్షణ చేయాలని సీఎం అన్నారు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలన్నారు. తొలి విడతలో చేపట్టే 15 లక్షల గృహ నిర్మాణాల్లో విశాఖ, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఈ గృహాల్లో పడక గది, వంట గది, లివింగ్ రూం, వరండా, మరుగుదొడ్ల లాంటి సదుపాయాలు ఉండేలా చూడాలనీ సీఎం అన్నారు.
జులై 8 న పేదవాడి దశ తిరిగే రోజు
— YS Sharmila (@ys_sharmila) July 4, 2020
ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ@ysjagan #PedalandarikiIllu #YSJaganCares pic.twitter.com/ioJDyqcGNj