YS Jagan: ప్రధానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ
YS Jagan: కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని ఏపీ సీఎం జగన్ ప్రధానిని కోరారు.
YS Jagan: కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ ని కోరారు. ఈ మేరకు ఆయన ఈ రోజు ప్రధానికి ఓ లేఖ రాశారు. కరోనా కట్టడికి కర్ఫ్యూ లాంటి అనేక తాత్కాలిక చర్యలు తీసుకున్నమని, వ్యాక్సిన్ అందించడమే కరోనా కు అత్యున్నత పరిష్కారమని వైఎస్ జగన్ అన్నారు.
అలాగే ఆక్సిజన్ కేటాయింపులు, సరఫరా వివరాలను లేఖ ద్వారా ప్రధానికి వివరించారు జగన్. కో వ్యాక్సినేషన్ తయారీ దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చలేక పోతుందని, ఈ వ్యాక్సిన్ ను భారీగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. కో వ్యాక్సిన తయారీకి భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, యన్.ఐ.వి లు కలిసి కృషి చేశాయని వివరించారు.
అలాగే తయారీదారులు ముందుకు వస్తే కో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు.. వారికి టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరారు. వీలైనంత త్వరగా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఎవరైనా వ్యాక్సిన్ ఉత్పత్తికి ముందుకు వస్తే, ప్రజల ఆరోగ్యం కోసం వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఈ విషయంలో తక్షణం ప్రధాని జోక్యం చేసుకుని, ఈ సలహాలను అమల్లోకి తీసుకురావాలని కోరుతున్నానని అన్నారు. వీలైనంత త్వరగా మీ నిర్ణయాన్ని ప్రకటించాలని ప్రధానికి లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.