YS Jagan: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు..

YS Jagan: సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

Update: 2024-10-04 11:49 GMT

YS Jagan: చంద్రబాబుకు దేవుడంటే భయం, భక్తి లేదు.. 

YS Jagan: సుప్రీంకోర్టు తీర్పుతో సీఎం చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జగన్ స్పందించారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహరంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేసిన జగన్.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నాడో సుప్రీంకోర్టు అర్థం చేసుకుని ఆయనకు మొట్టికాయలు వేసిందని విమర్శించారు.

కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ చంద్రబాబు పద్ధతి ప్రకారం అబద్ధాలు ఆడాడని, చంద్రబాబు స్వయంగా నియమించుకున్న టీటీడీ ఈవోనే చంద్రబాబు మాటలకు విరుద్ధంగా లడ్డూలపై ప్రకటన చేశాడని జగన్ వెల్లడించారు.

ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే ఎవరైనా కొద్దో, గొప్పో సిగ్గుపడతారని... దేవుడి విషయంలో ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు భయం, భక్తి ఉన్న వ్యక్తి అయితే అతడిలో పశ్చాత్తాపం అనేది రావాలని పేర్కొన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు ముందుకు రావాలని అన్నారు. కానీ చంద్రబాబు ఎలాంటివాడంటే... పశ్చాత్తాపం ఉండదు, దేవుడంటే భయం ఉండదు, భక్తి ఉండదు అని జగన్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News