YS Jagan: రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తా

YS Jagan: వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఎన్నికై నేటికి రెండెళ్లు. సీఎంగా తన రెండేళ్ల పాలనపై వైఎస్ జగన్ స్పందించారు.

Update: 2021-05-30 09:21 GMT

Ys Jagan  File Photo

YS Jagan: వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా ఎన్నికై నేటికి రెండెళ్లు. సీఎంగా తన రెండేళ్ల పాలనపై వైఎస్ జగన్ స్పందించారు. ఈ సంద్భంగా సోష‌ల్ మీడియాలో ట్విట్స్ చేశారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చుతూ వచ్చామని వెల్లడించారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.... ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు... మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని వివరించారు.

ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగాం. ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా మరింత తాపత్రయ పడతాను. మీరు ఇచ్చిన ఈ అధికారంతో అనుక్షణం.. ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నానని'' సీఎం వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.




Tags:    

Similar News