YS Jagan: నేను విన్నాను.. నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నాను

YS Jagan: డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం

Update: 2023-03-25 08:43 GMT

YS Jagan: నేను విన్నాను.. నేను మీ బాధలు చూశాను.. నేను ఉన్నాను

YS Jagan: మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, తమది మహిళా పక్షపాతి ప్రభుత్వమని అన్నారు సీఎం జగన్. ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌ ఆసరా 3వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. వైఎస్సార్‌ ఆసరా కింద రెండు విడతల్లో 12 వేల 758 కోట్లు జమ చేశామని, మూడు విడతల్లో కలిపి మొత్తం 19 వేల 178 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 78 లక్షల మందికి లబ్ధి జరుగుతోందని చెప్పారు. ఏపీ పొదుపు సంఘాలు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచాయని, పొదుపు సంఘాల్లో జరుగుతున్న విప్లవాన్ని ఇతర రాష్ట్రాలు వచ్చి పరిశీలించే స్థాయికి ఎదిగామన్నారు. గతంలో రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఎన్నికల తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారని గుర్తుచేశారు సీఎం జగన్.

Tags:    

Similar News