వారిని సముద్రమార్గంలో తీసుకొద్దాం : సీఎం జగన్
కరోనా లాక్‌డౌన్‌తో గుజరాత్‌లోని వీరావల్‌లో చిక్కుకుపోయిన ఐదు వేల మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
కరోనా లాక్‌డౌన్‌తో గుజరాత్‌లోని వీరావల్‌లో చిక్కుకుపోయిన ఐదు వేల మంది ఉత్తరాంధ్ర జిల్లాలకు మత్స్యకారులను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఇదే అంశంపై గుజరాత్ సీఎం విజయ్ రూపాని ఫోన్లోతో మాట్లాడారు. అయన సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికి వారిని సముద్రమార్గంలో రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ఈ విషయాన్ని సీఎం కార్యాలయం, మత్స్యశాఖ మంత్రి మోపిదేవ విడుదల చేసిన వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రానికి వీరావల్‌లో బోటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ బోట్లలో వారు విశాఖపట్నం చేరుకుంటారు. ఆతర్వాత విశాఖలో బస్సుల్లో జిల్లాల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తాం అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ మరో ప్రకటనలో తెలిపారు.
ఈ నిధులను గుజరాత్‌లోని సోమ్‌నాథ్ కలెక్టర్‌కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ గురువారం రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పంపుతున్నట్లు వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో వీరావల్‌లో కూలీలు ఇక్కట్లు పడుతున్నారు. మత్స్యకారులకు సౌకర్యాల కల్పన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఒక కోటి రూపాయలతో మంజూరు చేసింది.