AP TET Results 2024: ఏపీ టెట్ ఫలితాలు వాయిదా..కొత్త రిజల్ట్స్ రిలీజ్ డేట్ ఇదే
AP TET Results 2024: ఏపీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఫైనల్ కీ కూడా అధికారిక వెబ్ సైట్లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
AP TET Results 2024: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షల ఫలితాల విడుదలకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఫైనల్ కీ విడుదల చేసింది. అయితే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 2వ తేదీన ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. అయితే అనుకొని కారణాల వల్ల నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక ఫైనల్ కీ విడుదల చేసింది. ఏపీలో ఈ పరీక్షలు అక్టోబర్ 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈసారి ఏపీ టెట్ కు మొత్తం 4, 27,300 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3, 68, 661 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థఉలు ఫైనల్ కీ, ఫలితాలకు సంబంధించిన అప్ డేట్స్ ను https://aptet.apcfss.in/ వెబ్ సైట్లో చూసుకోవచ్చు.
మొత్తం 17 రోజుల పాటు రోజుకు రెండు విడతలుగా అత్యంత కట్టుదిట్టంగా ఈ పరీక్షలను నిర్వహించారు. ఏపీలో టెట్ రిజల్ట్స్ విడుదల అనంతరం మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ కూడా వీలైనంత త్వరగా జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం..నవంబర్ మొదటివారంలో ఉద్యోగ ప్రకటన ఇచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యాయ వివాదాలు లేకుండా ఏపీ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.
ఈ డీఎస్సీ ద్వారా 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.గత నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని భావించారు. అయితే మరికొంత మందికి టెట్ అర్హతకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో మొదట టెట్ నిర్వహించారు. ప్రస్తుతం టెట్ 2024 పరీక్షలు ముగిశాయి. రిజల్ట్స్ విడుదలకు ఏర్పాట్లను చేస్తున్నారు.