YS Jagan: సోషల్‌మీడియా వేధింపులకు అడ్డుకట్ట వేయాలి
YS Jagan: డ్రగ్ పెడ్లర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలి
YS Jagan: సోషల్‌మీడియా వేధింపులకు అడ్డుకట్ట వేయాలని హోంశాఖ అధికారులకు సూచించారు సీఎం జగన్. అందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. హోంశాఖపై రివ్యూ చేసిన సీఎం జగన్.. అధికారులకు పలు సూచనలు చేశారు. సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసులకు కచ్చితమైన ప్రోటోకాల్ ఉండాలని తెలిపారు. మహిళా పోలీసులు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులు, చేపడుతున్న బాధ్యతలపై సమగ్ర సమీక్ష చేయాలన్నారు. దిశ యాప్ మీద మరోసారి డ్రైవ్ నిర్వహించాలన్న సీఎం... ప్రతీ ఇంట్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారా? లేదా? అన్నదానిపై పరిశీలించాలని సూచించారు. దిశ యాప్ వల్ల జరిగే ప్రయోజనాలను వివరిస్తూ ప్రతి ఇంటికీ కరపత్రం ఇవ్వాలన్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఒక దిశ పోలీస్‌స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణాను పూర్తిగా నివారించాలని అధికారులకు తెలిపారు సీఎం. డ్రగ్ పెడ్లర్స్ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాలని.. శిక్షలు పెంచే ఆలోచన చేయాలన్నారు.