YS Jagan: కరోనాతొ అనాథలైన పిల్ల‌ల‌కు రూ.10 లక్షలు

YS Jagan: మహమ్మారి వైరస్ కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

Update: 2021-05-17 15:27 GMT

వైఎస్ జ‌గ‌న్ పాత చిత్రం

YS Jagan: క‌రోనా ర‌క్క‌సి ఎన్నో కుంటుంబాల్లో శోక‌స‌ముంద్రాన్ని మిగుల్చుతుంది. క‌రో్నాతో ఎంతో మంది అమాయ‌కులు ప్రాణాలు కొల్పోతున్నారు. వారి కుంటుంబాల్లో పిల్ల‌లు అనాథలుగా మిగుత‌లుత‌న్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నారు. ఆ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మహమ్మారి వైరస్ కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎం వైఎస్ జగన్‌ సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. క‌ర్ఫ్యూ పొడిగింపు, క‌రోనా రోగుల‌కు ప‌డ‌క‌లు, ఆక్సీజ‌న్, వ్యాక్సినేష‌న్ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులు చేర్చాల‌ని నిర్ణ‌యించారు గ్రామిణ ప్రాంతాల్లో క‌రోనా కేసులు, బ్లాక్ ఫంగ‌స్ కేసులు పెర‌గ‌కుండా దృష్టి సారించాల‌ని తెలిపారు. వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Tags:    

Similar News