Tirumala: ‘గోవిందకోటి’ రాస్తే వీఐపీ దర్శనం
Tirumala: రామకోటి తరహాలో గోవింద కోటి రాసేలా ప్రోత్సాహం
Tirumala: టీటీడీ నూతన పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సనాతన ధర్మవ్యాప్తిలో భాగంగా రాబోయే తరంలో భక్తి భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో రామకోటి తరహాలో గోవింద కోటి అనే సరికొత్త కార్యక్రమాన్ని టీటీడీ బోర్డు ప్రవేశపెట్టింది. 25 సంవత్సరాలలోపు యువతీ, యువకులు గోవిందా కోటి రాసేందుకు బోర్డు ఆవకాశం కల్పించింది, భక్తిశ్రద్ధలతో గోవింద కోటి రాసి టీటీడీకి సమర్పించిన వారి కుటుంబానికి విఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. అలాగే 10 లక్షల 1016 సార్లు గోవిందా నామాలు రాసిన వారికి సాధారణ శ్రీవారి దర్శనం వెసులుబాటు కల్పించనున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.