Andhra Pradesh: నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం
Andhra Pradesh: డిప్యూటీ చైర్మన్ పదవి వైశ్య, కాపు వర్గానికి కేటాయించే అవకాశం
Andhra Pradesh: కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. అయితే చైర్మన్ పదవిని మైనార్టీ అభ్యర్థికి డిప్యూటీ చైర్మన్ పదవిని రెండున్నరేళ్లు వైశ్య, కాపు వర్గానికి చెందిన వారికి ఇవ్వాలనుకుంటోంది అధిష్టానం. పెద్దల నిర్ణయంతో కంగుతిన్న వైసీపీ కౌన్సిలర్లు అధిష్టానం నిర్ణయం కాదనలేక అయిష్టంగానే ఒప్పుకున్నారు.
చైర్మన్ పదవి మైనార్టీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం ఆదేశాలు స్థానిక నేతలకు అందినట్టు తెలుస్తోంది. అయితే నంద్యాలలో మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాలలో వైసీపీకి ఆశించిన రీతిలో ఓట్లు రాలేదు. దీంతో రానున్న రోజుల్లో అలా జరగకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మైనార్టీ కౌన్సిలర్లలో చైర్మన్ పదవికి పోటీ పెరిగిన నేపథ్యంలో కొందరు కౌన్సిలర్ల కొత్త ప్రదిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఏకగ్రీవంగా చైర్మన్‌ను ఎన్నుకోవాలని ప్రణాళికలు చేసుకున్నారు. అయితే అధిష్టానం మాట తోసిపుచ్చడం సరికాదని ఎమ్మెల్యే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.