చంద్రబాబుకు IT నోటీసులను అస్త్రంగా మలుచుకున్న వైసీపీ.. ఓ వైపు చంద్రబాబుపై ఎటాక్, మరోవైపు పవన్‌పైనా విమర్శలు

AP News: చంద్రబాబు, అయన దత్తపుత్రుడు కలిసే అవినీతికి పాల్పడ్డారంటున్న వైసీపీ నేతలు

Update: 2023-09-07 11:31 GMT

చంద్రబాబుకు IT నోటీసులను అస్త్రంగా మలుచుకున్న వైసీపీ.. ఓ వైపు చంద్రబాబుపై ఎటాక్, మరోవైపు పవన్‌పైనా విమర్శలు

AP News: చంద్రబాబుకు IT నోటీసుల అంశాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది వైసీపీ. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఓ వైపు చంద్రబాబుపై ఎటాక్ చేస్తూనే మరోవైపు పవన్‌ కల్యాణ్ పైనా విమర్శణ బాణాలు ఎక్కుపెట్టింది. అవినీతి కేసులో చంద్రబాబుకు IT నోటీసులపై పవన్ నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్‌పై అనేక విమర్శలు చేస్తున్న పవన్.. చంద్రబాబు అవినీతిపైన మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ధ్వజమెత్తుతున్నారు అధికారపార్టీ నేతలు. తీగ లాగితే పవన్ ప్యాకేజీ అంశం బయట పడుతుందని పవన్‌కు భయమా అని విమర్శిస్తున్నారు. చంద్రబాబు ,అయన దత్తపుత్రుడు కలిసే అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అవినీతి ఎక్కడున్నా,, ఏ రూపంలో ఉన్నా, అది ఎవరు చేసినా ప్రశ్నిస్తానని, అది నా హక్కు అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పుడు సెలెంట్ గా ఉండడంపై తీవ్ర విమర‌్శలు వస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పావులు కదుపుతున్న పవన్.. అందుకే నోరు విప్పడం లేదా అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబును విమర్శిస్తే.. పొత్తు స్నేహం దెబ్బతింటుంది అనా లేక టీడీపీ అధినేత అవినీతికి పాల్పడలేదని నమ్ముతున్నారా అని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. చంద్రబాబు దొంగ అయినా పవన్ కళ్యాణ్ ఒప్పుకోడని.. హీరో అనే అంటాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అందుకు వారిద్దరి మధ్య ఉన్న బంధం అలాంటిదని విమర్శించారు. చంద్రబాబు 118 కోట్లు ముడుపులు తీసుకున్నాక కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పరని అన్నారు.

Tags:    

Similar News