AP News: రేపు సీఈసీతో స‌మావేశం కానున్న వైసీపీ ఎంపీలు

AP News: ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ

Update: 2023-08-27 14:00 GMT

AP News: రేపు సీఈసీతో స‌మావేశం కానున్న వైసీపీ ఎంపీలు

AP News: ఏపీలో ఓటర్ల తొలగింపు అంశం రాజకీయ వేడి రేపుతోంది. ఈ తరుణంలో రేపు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధమయ్యారు అధికార పార్టీ ఎంపీలు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం కానున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీతో భేటీ కానున్న ఎంపీలు.. ఏపీలో ఓటర్ల తొలగింపు అంశంపై టీడీపీ చేస్తోన్న ఆరోపణలను ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా అధికార పార్టీ దొంగ ఓటర్లను చేర్పిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. అయితే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు హయాంలోనే దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను చేర్పించినట్లు వైసీపీ ప్రత్యారోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈసీని కలిసేందుకు సిద్ధమయ్యారు వైసీపీ ఎంపీలు.

Tags:    

Similar News