YCP MP Raghurama Krishnam Raju Comments : ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మార్చుతూ పోతే ఎలా?

YCP MP Raghurama Krishnam Raju Comments : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు

Update: 2020-08-07 10:00 GMT
raghurama krishnam raju

YCP MP Raghurama Krishnam Raju Comments : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ప్రభుత్వం నిర్ణయాల్లో లోపాలను ఎత్తి చూపుతూ సొంత పార్టీ పైనే తిరుగుబాట జెండా ఎగరవేస్తున్నారయన. తాజాగా అయన మరోసారి కీలక వాఖ్యలు చేశారు. కరోనా కారణంగా ఏపీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇబ్బందిగామారిందని ఈ సమయంలో మూడు రాజధానాలు అవసరమా అని అయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు కూడా ఇవ్వలేని ప్రస్తుత పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ వెళ్ళడం సరైనది కాదని అన్నారు. అమరావతి రైతులకి న్యాయం చేయాలంటే 80 వేల కోట్లు అవసరం అవుతాయని అన్నారు. అమరావతిలో రాజధాని వస్తుందని మధ్యతరగతి ప్రజలు దాచుకున్న సొమ్ముతో భూములు కొన్నారని, దయచేసి వారికి ఇబ్బంది కలిగించొద్దని అయన వాఖ్యానించారు.

ఇక రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు సరికావన్నారు. జిల్లాకో రాజధాని పెడతామన్న వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఒక సామాజిక వర్గం వారు రాజధాని వల్ల బాగుపడుతున్నారనే భావన కరెక్ట్ కాదని అయన వెల్లడించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా అందరూ శిరసావహించాలని వెల్లడించారు. రాజధాని వ్యవహారంపై రిఫరెండానికి వెళ్లాలని జగన్ ప్రభుత్వాన్ని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు.

ఇక న్యాయ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని, న్యాయవ్యస్థ పై కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను సీఎం జగన్ అడ్డుకోవాలని అన్నారు. .న్యాయవ్యవస్థను మనం గౌరవిస్తే ఇతరులు గౌరవిస్తారని అయన వాఖ్యానించారు.  

Tags:    

Similar News