సీఎం జగన్ పుట్టినరోజుకల్లా నగరిలో ఇది ఉండకూడదు : ఎమ్మెల్యే రోజా

Update: 2019-11-16 07:45 GMT

నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసి చైర్మన్ ఆర్కే రోజా ప్లాస్టిక్ ను పోరాటం ప్రకటించారు. తన నియోజకవర్గంలో 'స్వచ్ఛ నగరి' కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో మరియు ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడంలో ఎమ్మెల్యే వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. నగరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అన్ని మునిసిపల్ వార్డులు, పంచాయతీ గ్రామాల నుండి ప్రమాదకర ప్లాస్టిక్‌ను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మేరకు ఫేస్బుక్ పోస్ట్ ద్వారా, ఆమె కేజీ ప్లాస్టిక్ తీసుకొస్తే కిలో బియ్యం ఇస్తున్నట్టు బంపర్ ఆఫర్ను ప్రకటించారు, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కార్యక్రమం నవంబర్ 17 తన పుట్టినరోజు నుండి ప్రారంభంకానుందని. సిఎం వైయస్ జగన్ పుట్టినరోజు (డిసెంబర్ 21) వరకు 'ప్లాస్టిక్ లేని న్యూ నగరి' అనే నినాదంతో కొనసాగుతుందని ఆమె చెప్పారు.


Tags:    

Similar News