టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఎస్ కాంతారెడ్డి కార్యకర్తలతో అవమానకరంగా మాట్లాడుతున్నారని వైసీపీ మహిళా నేత గజ్జల లక్ష్మి ఆరోపించారు. కాంతారెడ్డి మాటలు మానసికంగా కుంగిపోయే విధంగా ఉన్నాయని, రాజకీయాలే వదిలేయాలన్నంత ఆవేదన కలిగిందని గజ్జల లక్ష్మి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైసీపీలో చురుకైన మహిళా నాయకురాలిగా గుర్తింపు కలిగిన లక్ష్మి కార్యకర్తలను అవమానించే వారిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలకు ఫిర్యాదు చేశారు. నిజమైన కార్యకర్తలకు గుర్తింపులేకుండా పోతోందని కన్నీటి పర్యంతమయ్యారు.