Bonda Umamaheswara Rao: అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ
Bonda Umamaheswara Rao: వైసీపీకి విజన్ అంటే అర్థమే తెలియదు
Bonda Umamaheswara Rao: అవినీతి పునాదులపై పుట్టిన పార్టీ వైసీపీ అని మండిపడ్డారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ. జగన్ చెప్పే ప్రతి మాట అబద్ధమేనని ఫైర్ అయ్యారు. టీడీపీ విజన్ డాక్యుమెంట్ ఇస్తుంటే.. వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ ఇస్తోందని విమర్శించారు. అభివృద్ధి ఎలా చేయాలనేది తమ విజన్ డాక్యుమెంట్ అయితే.. ఎంత మందిని జైళ్లకు పంపాలనేది వైసీపీ ప్రిజన్ డాక్యుమెంట్ అని ఆరోపించారు. వైసీపీకి విజన్ అంటే అర్థమే తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 420 అయితే.. వైసీపీ నేతలంతా 840 గాళ్లంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు బోండా ఉమ.