ఇవాళ 175 నియోజకవర్గాల పరిశీలకులతో సజ్జల భేటీ
Sajjala Ramakrishna Reddy: ఎలక్షన్‌పై ఫోకస్ పెట్టిన వైసీపీ
Sajjala Ramakrishna Reddy: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ఫోకస్ పెంచింది. ఎన్నికల్లో 175 నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్ చేయాలనే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల పరిశీలకుతో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల సమావేశం కానున్నారు. కాసేపట్లో తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ సమావేశం జరగనుంది. 175 నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సమావేశంలో సజ్జల చర్చించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నియోజకవర్గాల పరిశీలికులకు దిశానిర్దేశం చేయనున్నారు.