Guntur: మేయర్ రేసులో వైసీపీ అభ్యర్థుల పోటాపోటీ

Guntur: టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర * వైసీపీలో వినిపిస్తున్న ముగ్గురు అభ్యర్థుల పేర్లు

Update: 2021-03-13 08:28 GMT

వైసీపీ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)

Guntur: గుంటూరు మేయర్‌ పీఠం కోసం ఆశావాహులు తెగ ట్రై చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అధికార పార్టీ ఇంకా అభ్యర్థి ప్రస్థావనే తీసుకురాలేదు. అయితే మేయర్‌ రేసులో ముగ్గురు వైసీపీ నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. మరీ అధిష్ఠానం ఎవరికీ పట్టం కడుతుంది. ఎవరెవరిని బుజ్జగిస్తుంది.?

గుంటూరు జిల్లాలో 15 ఏళ్ల తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. గెలుపుపై ఎవరీ అంచనాలు వారికి ఉన్నాయి. టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర అలియాస్ నాని పేరు ఖరారైంది. కానీ మేయర్ అభ్యర్థిపై వైసీపీ ఇంకా ఓ క్లారిటీకి రాలేదు.

మేయర్ రేసులో నిన్నటి వరకు ఇద్దరి పేర్లు వినిపించాయి. మనోహర్ నాయుడు, పాదర్తి రమేష్ గాంధీ ఈ ఇద్దరు నేతలు మేయర్‌ అభ్యర్థి కోసం నేతల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఉన్నట్టుండి బండ్లమూడి రోజారాణి పేరు తెరపైకి వచ్చింది.

కావాటి మనోహర్ నాయుడు పెదకూరపాడు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే సీటు ఆశించి బంగపడ్డారు. దానికి ప్రతిఫలంగా మేయర్ పదవీ తనకే దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. ఇక పాదర్తి రమేష్ గాంధీ కూడా మేయర్ పదవీ తనకే వస్తుందని దీమాగా కనిపిస్తున్నారు. పైగా గుంటూరు పట్టణంలో తన సామజిక వర్గం వైశ్యుల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. దీనికి తోడు మంత్రి వెల్లంపల్లి సపోర్ట్ కూడా ఉంది. దీంతో మేయర్ సీటులో కూర్చునేది తానేనని నమ్మకంగా ఉన్నారు.

ఇక మేయర్ రేస్‌లో వినిపిస్తున్న మరో పేరు బండ్లమూడి రోజా రాణి గుంటూరు వెస్ట్ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేసిన రోజా రాణి టీడీపీకి టఫ్‌ ఫైట్‌ ఇచ్చారు. టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర సైతం ఈ స్థానం నుంచే బరిలో నిలబడ్డారు. ఇక్కడ రోజారాణి గెలిస్తే. టీడీపీ కంచుకోట బద్దలైనట్లే అందుకే ఆమెకు మేయర్ పదవీ దక్కే అవకాశాలు లేకపోలేదు. ఇక రేపు రిజల్ట్ వచ్చాక మేయర్‌ ఆశావాహులు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోనక్కర లేదు. మరీ వైసీపీ అధిష్టానం ఎవరికీ అవకాశం కల్పిస్తుందో చూడాలి. 

Tags:    

Similar News