YCP Bus Yatra: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్ర
YCP Bus Yatra: సామాజిక సాధికార యాత్ర పేరుతో క్యాంపెయిన్
YCP Bus Yatra: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి వైసీపీ బస్సు యాత్రలు ప్రారంభం కానున్నాయి. సామాజిక సాధికార యాత్ర పేరుతో.. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఈ వైసీపీ బస్సు యాత్ర సాగనుంది. నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాలతో పాటు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం చేసిన మేలును బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం నుంచి, కోస్తాంధ్రలో తెనాలి నుంచి, రాయలసీమలో సింగనమల నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ప్రతిరోజూ మూడు ప్రాంతాల్లో మూడు సభలు ఉండేలా ప్లాన్ చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్రలు జరగనున్నాయి.