Tirupati Bypoll: ఇంతకి జగన్‌ లేఖస్త్రాల స్ట్రాటజీ ఎంటీ?

Tirupati Bypoll: స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల్లో విజ‌యం కిక్ ఇస్తుంది. ఎన్నిక అంటే స‌మ‌రోత్సాహంతో దూసుకెళ్లాల‌నే ఊపు ఇస్తుంది. అయితే ఊరికే క‌ల‌లు కంటే చాల‌దు.

Update: 2021-04-10 12:38 GMT

Tirupati Bypoll: ఇంతకి జగన్‌ లేఖస్త్రాల స్ట్రాటజీ ఎంటీ?

Tirupati Bypoll: స‌హ‌జంగా రాజ‌కీయ పార్టీల‌కు ఎన్నిక‌ల్లో విజ‌యం కిక్ ఇస్తుంది. ఎన్నిక అంటే స‌మ‌రోత్సాహంతో దూసుకెళ్లాల‌నే ఊపు ఇస్తుంది. అయితే ఊరికే క‌ల‌లు కంటే చాల‌దు. ఆ క‌ల‌ను సాకారం చేసుకోవాలంటే అవసరమైన వ్యూహాలు రచించాలి. తిరుపతిలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక‌లో విజ‌యం ఏ పార్టీకి ఆషామాషీ కాదు. క్షేత్రస్థాయిలో ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డే శ్రేణులు, నాయ‌క‌త్వం ఉంది. అందుకే గెలుపు కోసం జగన్‌ లేఖల్లో సెంటిమెంట్‌ రాజేస్తున్నారా? ఇంతకి జగన్‌ లేఖస్త్రాల స్ట్రాటజీ ఎంటీ?

ఏపీలో ఇప్పటికే వరుస ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. పంచాయితీ, మున్సిపల్‌ ఎన్నికల్లో విజయాలతో జోరు మీదున్న వైసీపీ ఇప్పుడు తిరుపతి లోక్ సభ స్థానంపై ఫోకస్ పెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది. సాదా సీదా గెలుపు కాదు కనీసం 4 లక్షల మెజార్టీ సాధించాలని సీఎం జగన్ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు. ఇందుకోసం తను కూడా రంగంలోకి దిగాలని బావించారు. ఎమైందో ఏమో..! యూట్నర్‌ తీసుకొని సెంటిమెంట్‌ డైలాగ్‌లతో తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లకు లేఖలు రాస్తున్నారు.

సీఎం జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్నందున రాలేకపోతున్నానని, వెల్లడించారు. ''మీరంతా నా వాళ్లే.. నేను సభకు హాజరైతే వేలాది మంది వస్తారు. మళ్లీ కోవిడ్‌ కేసులు పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. బాధ్యతగల ?సీఎంగా తిరుపతిలో సభ రద్దు చేసుకుంటున్నానన్నారు. ఇక రెండు రోజుల క్రితం కూడా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలోని కుటుంబాలకు ఓ లేఖలు రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఆయా కుటుంబాలకు వివిధ పథకాలు, కార్యక్రమాలు ద్వారా జరిగిన లబ్ధిని లేఖలో వివరించారు. అయితే ఈ రెండు లేఖల్లో ప్రతిపక్ష పార్టీలమీద ఎలాంటి విమర్శలు చేయకుండా ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను, ప్రభుత్వం దార్శినికతను, వాగ్దానాలను నిలబెట్టుకున్న విధానాన్ని తెలియజేశారు. జగన్‌ రాసిన ఉత్తరాలు ఇంతకుముందు రాజకీయ సంస్కృతికంటే భిన్నంగా సాగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటువేసి వైసీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న డాక్టర్‌ గురుమూర్తిని గెలిపించాలంటూ ఆయా కుటుంబాలను లేఖల ద్వారా అభ్యర్థించారు.

నిజానికి తిరుపతిలో ముక్కోణపు పోటీ నెలకొంది. తొలుత వైసీపీ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంటుందని భావించినా మారుతున్న సమీకరణాల నేఫథ్యంలో ఆ పార్టీ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పాటు బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్ధి నుంచి ఎదురవుతున్న పోటీతో తమ అవకాశాలపై ఎక్కడ ప్రభావం పడుతుందో అనే ఆందోళన వైసీపీలో కనిపిస్తోంది. అందుకు జగన్‌ లేఖల్లో సెంటిమెంట్‌ను స్ట్రాటజీ అమలు చేస్తున్నారని కొందురు విశ్లేశిస్తున్నారు.

వైసీపీ, టీడీపీతో పాటు బీజేపీ-జనసేన మధ్య గట్టి పోటీ నెలకొంది. సామాజిక వర్గాల వారీగా చూసినా ఈ ఉపఎన్నికలో అభ్యర్ధుల మధ్య గట్టిపోటీ నెలకొంది. ఓట్ల చీలికలు, స్ధానిక అంశాలు, ధన, మధ్య ప్రవాహాలు, సంక్షేమ పథకాలు ఇలా ఎన్నో అంశాలు ఈ ఎన్నికలో కీలకంగా మారిపోతున్నాయి. దీంతో తిరుపతిలో ఓ దశలో రికార్డు మెజారిటీ సాధిస్తామని చెప్పిన వైసీపీకి ఇప్పుడు టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యర్ధుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

మరి ఈ దఫా సీఎం జగన్ కోరుతున్నట్లు 4 లక్షల మెజారిటీ సాధించాలంటే పోలింగ్ శాతం పెంచడంతో పాటు మరిన్ని అదనపు ఓట్లు సాధించడమే వైసీపీ ముందున్న లక్ష్యం. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు తిరుపతిలో తమకు కలిసివస్తాయని వైసీపీ భావిస్తోంది. మరి జగన్‌ లేఖలు, పార్టీ వ్యూహాలు ఓటర్లను పోలింగ్ కేంద్రంకు తీసుకోస్తాయో లేదో చూడాలి.

Tags:    

Similar News