Anakapalle: నూకాంభిక అమ్మవారి సన్నిధిలో.. కూతురి పేరిట 51 కిలోల టమాటాలతో తులాభారం..
Anakapalle: మొత్తానికి టమాటా విలువైన వస్తువులు జాబితాలో చేరిపోయింది
Anakapalle: ఉమ్మడి విశాఖ జిల్లాలో భగవంతుడుకి తులాభారం వేయడం అంటే అత్యంత విలువైన వస్తువులతో చేస్తారు. కానీ ఇప్పుడు టమాటా అత్యంత విలువైనదిగా మారిపోయింది. అదే భావనతో అనకాపల్లి జిల్లాలో ఒక భక్తుడు నుకాంబిక అమ్మవారి సన్నిధిలో తన కూతురు పేరిట 51 కిలోలతో తులాభారం వేశారు. తన కూతురు బరువుకి తగిన టమాటాలు సమర్పించారు. వాటిని అమ్మవారి అన్నదానానికి వాడమని కోరారు. దీంతో ఈ తులాభారాన్ని ఆసక్తిగా అక్కడ భక్తులు తిలకించారు. మొత్తానికి టమాటా విలువైన వస్తువులు జాబితాలో చేరిపోయింది.