Weather Updates: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రాంతాలల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం..
Weather Updates: ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పచ్చిమ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని..
Weather Updates: ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పచ్చిమ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో రేపు(గురువారం) రాష్ట్రంలో పలుచోట్ల తెలికపాటినుండి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అంతే కాదు, భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షాలు కురిసే అవకాసం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలుగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. దీంతో కనిగిరి, కొనకనమిట్ల, మర్రిపూడి, హనుమంతునిపాడు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని వారు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఏపీతో సహా తెలంగాణాలో కుడా పలు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాసం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇటు నేడు తెలంగాణ రాష్రంలో కుడా నేడు పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి.