Weather Updates: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
Weather Updates: ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతం, ఆపరిసరాలను ఆనుకుని దక్షిణ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది.
Weather Updates: ఉత్తర మధ్యప్రదేశ్ ప్రాంతం, ఆ పరిసరాలను ఆనుకుని దక్షిణ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమొరెన్ ప్రాంతం దాకా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులుతో భారీ వర్షాలు కురుస్తాయి అని ముఖ్యంగా రాయలసీమలలో వచ్చే రెండు రోజులలో ఒకటి లేదా రెండు ప్రదేశాలలో తేలికపాటి నుండి మితమైన జల్లులు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.
ఇక, తెలంగాణలోనూ రానున్న రెండు రోజులు తేలికపాటి నుండి ఓమోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాసం ఉందని సమాచారం. ఇప్పటికే తెలంగాణాలో సాదారణ వర్షపాతం కంటే సుమారు 44 శాతం అధికంగా వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.