Weather Updates: కొనసాగుతున్న అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!
Weather Updates: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది.
Weather Updates: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఇద మరింత బలపడే అవకాశం ఉన్సి. అల్పపీడనానికి అనుబంధంగా 7.6 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, తూర్పు తెలంగాణాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఆగకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో ప్రజా జీవితానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాగల రెండు, మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనివల్ల కోస్తా తీరం వెంబడి బలమైన గాలులుంటాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రానున్న 48 గంటల పాటు కోస్తా, సీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సమాచారం.