Weather Updates: ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు

Weather Updates: * బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం * తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన * వాయుగుండంగా మారిన అల్పపీడనం * ఇవాళ, రేపు ఏపీలో తేలికపాటి నుంచి భారీమోస్తరు వర్షాలు * రేపు వాయుగుండం తుపానుగా మారే అవకాశం * రేపు రాయలసీమలో, ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు * బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్‌కు నివర్‌ గా నామకరణం * అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్‌కు గతి గా పేరు

Update: 2020-11-23 05:22 GMT

ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతానికి దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల 25, 26న ఏపీలో తేలిక పాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ తుపానుకు ఇరాన్ దేశం సూచించిన నివర్ అని పేరు పెట్టింది. నివర్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.‎ ఈ తుపాను వాయువ్య దిశగా పయనించి తమిళనాడు- పుదుచ్చేరి తీరాల వద్ద కరైకల్ -మహాబలిపురంల మధ్య ఈ నెల 25న తీరం దాటే అవకాశం ఉంది.

అల్పపీడనం ప్రభావంతో సోమవారాల్లో ఉత్తర కోస్తాంధ్రాలో తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలుగురాష్ట్రాల్లోని మిగతా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడిచింది.

నివర్ తుపాన్ ప్రభావంతో ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. అరేబియా సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన తుపానుకు గతి పేరు పెట్టారు. పశ్చిమ తీరానికి దూరంగా ఉన్నప్పటికీ, వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News