CID Lawyers: మరికొన్ని రోజులు కస్టడీ కోరతూ పిటిషన్ దాఖలు చేశాం
CID Lawyers: ఇరు పక్షాల వాదనలు విని తీర్పు చెబుతానన్న న్యాయమూర్తి
CID Lawyers: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ అప్లికేషన్ విచారణకు వచ్చిందని సీఐడీ తరఫు న్యాయవాదులు చెప్పారు. అయితే తాము మొదట దాఖలు చేసిన పిటిషన్‌పై రెండు రోజుల పాటు చంద్రబాబును పోలీసు కస్టడీకి అనుమతిస్తూ తీర్పు ఇచ్చారని చెప్పారు. కానీ ఈ రెండు రోజులూ తమకు చంద్రబాబు నుంచి మేమడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాలేదని, అందుకే మరోసారి కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు సీఐడీ తరఫు లాయర్లు... అయితే చంద్రబాబు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్, తాము వేసిన కస్టడీ పిటిషన్‌పై రేపు ఒకేసారి వాదనలు విన్న తర్వాత తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి చెప్పారని సీఐడీ లాయర్లు చెప్పారు.