Dwarampudi: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు

Dwarampudi: గ్రామీణ ప్రాంతాల్లో వాలంటీర్ల వ్యవస్థతో ప్రయోజనాలు

Update: 2023-07-14 01:56 GMT

Dwarampudi: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా వాలంటీర్లు

Dwarampudi: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పనితీరుతో ప్రజావిశ్వాసం చూరగొన్నామని, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరావు అన్నారు. కాకినాడలో నిర్వహించిన గ్రామ, వార్డు వాలంటీర్ల ఆత్మగౌరవ సభకు ఆయన హాజరయ్యారు. ప్రభుత్వంపట్ల పెంచుకున్న కక్షతో వాలంటీర్ల వ్యవస్థను తప్పుబట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ పనుల్లో వాలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని, ప్రజలకు అన్నిపనుల్లో చేదోడువాదోడుగా సేవలు అందిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.

Tags:    

Similar News