Viveka Murder Case: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. సీబీఐ కోర్టులో లొంగిపోనున్న ఎర్ర గంగిరెడ్డి
Viveka Murder Case: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎర్ర గంగిరెడ్డి.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన తర్వాత న్యాయమూర్తి రిమాండు విధించే అవకాశం ఉంది
Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్రగంగిరెడ్డి హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోనున్నారు. ఇవాళ మధ్యాహ్నంలోపు న్యాయవాదుల సమక్షంలో లొంగిపోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఎర్ర గంగిరెడ్డి.. సీబీఐ కోర్టులో లొంగిపోయిన తర్వాత న్యాయమూర్తి రిమాండు విధించే అవకాశం ఉంది.
ఇప్పటికీ ఈ కేసులో అరెస్టయిన సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు చంచల్ గూడ జైల్లో ఉన్నారు. వివేకా కేసులో ఎర్రగంగిరెడ్డి పాత్ర కీలకంగా మారింది. వివేకా హత్యకు పథక రచన చేయడంతో పాటు దాన్ని అమలు చేసి, తర్వాత సాక్ష్యాధారాలు ధ్వంసం చేయడంలోనూ ఎర్రగంగిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. ఎర్రగంగిరెడ్డి లొంగిపోయిన తర్వాత.. సీబీఐ అతడిని కస్టడీకి కోరే అవకాశం ఉంది.