Visakhapatnam: ముహూర్తం ఫిక్స్.. ఏపీ పాల‌నా రాజ‌ధానిగా విశాఖ

Visakhapatnam: పలు శాఖలకు బిల్డింగ్‌లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

Update: 2023-11-28 14:15 GMT

Visakhapatnam: ముహూర్తం ఫిక్స్.. ఏపీ పాల‌నా రాజ‌ధానిగా విశాఖ

Visakhapatnam: ఏపీ ప్రభుత్వం విశాఖను పాల‌నా రాజ‌ధానిగా చేయ‌డం ఖాయ‌మయింది. ఏపీ రాజధానికి సంబంధించి పలు న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు ఉండటంతో.. వి‌శాఖ నుంచి ముఖ్య‌మంత్రి పాల‌నను సాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్ప‌టికే విశాఖ‌ప‌ట్టణంలో మంత్రులకు,ఉన్న‌తాధికారుల‌కు బిల్డింగ్ లు ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వం ఇప్పుడు ఏకంగా ముహూర్తం డేట్ కూడా ఫిక్స్ చేసింది.

డిసెంబర్ 8 నుంచి విశాఖ నుంచే తాను పరిపాలన సాగిస్తానని సీఎం చెప్పేడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. వ‌చ్చే నెల డిసెంబ‌ర్ 8వ తేదీన కుటుంబ స‌మేతంగా జ‌గ‌న్ విశాఖ‌కు వెళ్లిపోవ‌డం ఖాయ‌మ‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కూడా అన్నారు. ఇక‌, ఇప్ప‌టికే అక్కడ అనేక కార్యాల‌యాల‌ను కేటాయిస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. హోం శాఖ నుంచి సాంఘిక సంక్షేమ శాఖ వ‌ర‌కూ అన్ని శాఖ‌ల‌ను విశాఖ‌కు త‌ర‌లిస్తూ..తాజాగా ఉత్తర్వులిచ్చింది.

ఇదిలావుంటే, మ‌రోవైపు.. అధికారుల కోసం కూడా ప్రభుత్వం నివాసాల‌ను ఖ‌రారు చేసింది. మొత్తంగా చూస్తే.. ఈ సారి సీఎం జ‌గ‌న్ విశాఖ‌కు వెళ్లేందుకు మ‌హూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబ‌రు 8 ఏకాద‌శి.. హ‌స్తా న‌క్ష‌త్రం రోజున ముహూర్తం ఖ‌రారు చేశారు. మొత్తానికి ఈ రాజధాని అంశం ఇప్పటి వ‌ర‌కూ పలు సార్లు వాయిదా ప‌డింది. మ‌రోవైపు న్యాయ స్థానాల నుంచి ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. సీఎం రాజధాని అంశంపై దూకుడు ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News