Visakhapatnam: విశాఖ వార్షిక క్రైమ్‌ రిపోర్టు విడుదల.. గత ఏడాదితో పోలిస్తే 30శాతం తగ్గిన క్రైం రేట్

Visakhapatnam: నేర రహిత నగరంగా మారబోతోందన్నారు పోలీసులు

Update: 2023-12-31 14:15 GMT

Visakhapatnam: విశాఖ వార్షిక క్రైమ్‌ రిపోర్టు విడుదల.. గత ఏడాదితో పోలిస్తే 30శాతం తగ్గిన క్రైం రేట్

Visakhapatnam: విశాఖలో క్రైమ్‌కు కళ్లెం పడుతోంది. నేరాలు, ఘోరాలపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో సానుకూల ఫలితాలు వస్తున్నాయి. మెల్లమెల్లగా నేరాల సంఖ్య తగ్గుతోంది. విశాఖ వార్షిక క్రైమ్‌ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. గ్రేటర్ విశాఖపట్నం నేర రహిత నగరంగా మారబోతోందన్నారు పోలీసులు. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం క్రైం రేట్ తగ్గిందని తెలిపారు. ప్రివెన్షన్ పోలీసింగ్ విధానంతో మరింత నేరాల సంఖ్య తగ్గించి న్యూ పోలీస్ పాలసీ తీసుకువస్తామన్నారు.

విశాఖలో నేరాల సంఖ్య తగ్గించేందుకు వైజాగ్ పోలీసులు కొత్త విధానాలను ప్రవేశ పెడుతున్నారు. కేసుల దర్యాప్తునకు శాస్త్రసాంకేతిక పద్దతులను అవలభించి త్వరితగతిన నేరస్థులను పట్టుకోవడం, కేసులను చేధిస్తూ నేరాలకు చెక్ పెడుతున్నారు. ఈ చర్యల వల్ల గతంతో పోల్చుకుంటే నేరాల సంఖ్య తగ్గింది. కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్‌గా మారింది. ఆన్‌లైన్ మోసలు పెరిగినట్టు తెలిపారు. అలాగే మహిళలపై దాడులు తగ్గాయని, దిశ ప్రభావంతో మహిళల భద్రత పెరిగిందన్నారు విశాఖ పోలీసులు. ఇక ఖాకీల కట్టుదిట్టమైన చర్యలు వల్ల.. గంజాయి సాగు కూడా తగ్గింది. కానీ ఇతర ప్రాంతాల నుంచి రవాణా పెరిగినట్టే తెలిపారు..

విశాఖలో 2023లో 27 హత్యలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అందులో ఎక్కువగా అక్రమ సంబంధాలు, ఆవేశంలో చేసిన హత్యాలే అధికంగా ఉన్నాయి. దిశ యాప్ నేర నివారణలో చాలా కీలకంగా మారిందన్నారు. 21 లక్షల మందికి పైగా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ కౌన్సిలింగ్ సెంటర్ల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని పోలీసు కమిషనర్ రవి శంకర్ తెలిపారు. గంజాయి రవాణాకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్నారు. ఒరిస్సా నుంచే ఎక్కువ గంజాయి విశాఖ వచ్చి వేరే రాష్ట్రాలకు వెళుతుందన్నారు సీపీ. ఈ రవాణాను నివారించేందుకు పటిష్టంగా పని చేయబోతున్నట్టు కమిషనర్ చెప్పారు. గతంతో పోల్చుకుంటే విశాఖలో గంజాయి వాడకం తగ్గిందన్నారు. 2022 లో 39 మర్డర్లు నమోదు కాగా.. 2023లో 27 మర్డర్ కేసులు నమోదు అయ్యాయన్నారు.

2022లో 42 కిడ్నాప్ కేసులు నమోదు కాగా..2023లో 18 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయన్నారు సీపీ. 2022లో 127 అత్యాచారం కేసులు నమోదు కాగా 2023లో 78 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 2022లో 841 వైట్ కాలర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. 2023లో 723 వైట్ కాలర్ క్రైం కేసులు నమోదు అయ్యాయని విశాఖ పోలీస్ కమిషనర్ వివరించారు.

మొత్తానికి విశాఖను నేర రహిత నగరంగా మార్చేందుకు పోలీసులు కొత్త విధానాలతో ప్రణాళికలు తయారు చేస్తున్నారు. వచ్చే ఏడాది వైజాగ్ క్రైం లెస్ సిటీ కాబోతుందని ఆకాంక్షిద్దాం.

Tags:    

Similar News