Violence in AP Tourism office: వెలుగులోకి వస్తున్న టూరిజం శాఖ ఉద్యోగుల ఆగడాలు!
Violence in AP Tourism office: నెల్లూరు జిల్లా టూరిజం శాఖ అధికారుల దౌర్జన్యకాండ ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
Violence in AP Tourism office: నెల్లూరు జిల్లా టూరిజం శాఖ అధికారుల దౌర్జన్యకాండ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. దివ్యాంగురాలు అని చూడకుండా ఉద్యోగినిపై వీచక్షణ రహితంగా దాడి చేసిన భాస్కర్ అండ్ టీం ఎత్తిగడులు చూస్తుంటే ఎవరైన నోరేళ్లబెట్టాల్సిందే. జూన్ 27న దివ్యాంగురాలైన ఉషారాణిని టూరిజం హోటల్ లో అడ్మిన్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పాచవీకంగా దాడి చేసిన దృష్యాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. తన కింద పని చేసే ఉద్యోగిని పైగా దివ్యాంగురాలు అని చూడకుండా భాస్కర్ ఓ మృగాడిలా దాడి చేశాడు. సీసీ పుటేజీ లో రికార్డైన ఈ దృశ్యాలు ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ రెండు రోజుల్లోనే తనను ఉద్యోగం నుంచి తప్పించాలని భాస్కర్ అండ్ టీం విశ్వప్రయత్నాలు చేసినట్లు బాధితురాలు వెల్లడించింది.
దాడి జరిగిన వెంటనే ఉషారాణిపై ఓ నెగిటివ్ రిపోర్టు తయారు చేశారట. ఆమె కార్యాలయంలో అందరిని ఇబ్బంది కలిగిస్తుందని, ప్రవర్తన సరిగా ఉండదని, రెండు పేజీలతో కూడిన ఒక నివేదికను తయారుచేశారట. పైగా14 మందితో బలవంతంగా సంతకాలు చేయించి, ఉన్నతాధికారులకు పంపారట. అయితే ఈ తతంగమంతా మరో అధికారి అస్త్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీసీ పుటేజీ బయటికి రాకుంటే దాడికి గురైన ఉషారాణి ఉద్యోగం కూడా కోల్పోవల్సి వచ్చేదని కొందరు అనుకుంటున్నారు. అయితే తాను దర్గామిట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం వల్లే ఉద్యోగ ప్రమాదం తప్పిందని బాధితురాలు చెబుతోంది.
అయితే గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగులపై డివిజన్ స్థాయి అధికారులు పెట్టే వేధింపులు భరించలేక గతంలో ఓ యువతి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు లెక్కల్లో గోలుమాలు సృష్టించి లక్షల రూపాయాలు అధికారులు స్వాహా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించిన తాత్కాలిక ఉద్యోగులపై బెదిరింపులు, మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఉషారాణి పోలీసులకు తెలిపింది. శాఖాపరమైన అంశాలపై నిధుల వ్యయంపై దృష్టి సారిస్తే మరిన్ని కఠోర వాస్తవాలు బయటపడతాయిని తీవ్రంగా చర్చ జరుగుతోంది.