Vijaysai Reddy: పురంధేశ్వరికి విజయసాయిరెడ్డి కౌంటర్
Vijaysai Reddy: బాబుది స్క్రిప్ట్ ... వదినది డైలాగ్
Vijaysai Reddy: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా కౌంటరిచ్చారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదన్నారు. బాబుది స్క్రిప్ట్ ... వదినది డైలాగ్ ..అని పేర్కొన్నారు. తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ ... మరిది కళ్లల్లో ఆనందమే టార్గెట్ అని తెలిపారు. మీ నాన్న గారు.. మహానటులు .. మీరు కాదనుకున్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు తెలిపిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తు్న్నారంటే మీ నటన కౌశల్యాన్ని అభినందించాల్సిందేనని కామెంట్స్ చేశారు.