ఆప్ఘాన్ అమ్మాయి..ఆంధ్ర అబ్బాయి..మూడుముళ్ల బంధం!
* కులాలు, మతాలు, దేశం దాటిన ప్రేమ * పెద్దల అంగీకారంతో వివాహం * వేద మంత్రాల సాక్షిగా వివాహం
వారి ప్రేమకు కులం అడ్డు రాలేదు. మతాన్ని పట్టించుకోలేదు. దేశాలు దాటి మరీ వారి ప్రేమ చిగురించింది. పరిచయం స్నేహంగా మారింది స్నేహం ప్రేమగా మారి.. మూడుముళ్ల బంధానికి దారి తీసింది. దాంతో వారు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఆఫ్ఘానిస్థాన్ అమ్మాయితో బెజవాడ అబ్బాయి జత కట్టాడు వేదమంత్రాల సాక్షిగా అబ్బాయి వధువు మెడలో తాళి కట్టాడు.
ఆంధ్రా అబ్బాయి.. ఆఫ్షనిస్తాన్ అమ్మాయి ఒక్కటయ్యారు.. పెద్దల సమక్షంలో.. హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో, ఏడు అడుగులు నడిచారు. విజయవాడ లో జరిగిన వివాహ రిసెప్షన్ లో ఆహ్వానితులు.. నవ దంపతులు ను ఆశీర్వదించారు.
రైల్వే డిఎస్పీ గా పనిచేస్తున్న అశోక్ కుమార్.. లక్ష్మీ మహేశ్వరి దంపతుల కుమారుడు వివేకానంద రామన్ ఢిల్లీ లో ఉద్యోగం చేస్తుండగా... అక్కడ. ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన అమ్మాయి ఫ్రోజ్ షిరిన్ తో పరిచయం ఏర్పడింది. మాటా మాటా కలవడంతో పాటు మనసులు కూడా దగ్గర అయ్యాయి. కలిసి నడుద్దామని నిర్ణయించుకున్న ఆ జంట ఇంట్లో పెద్దలకు వారి ప్రేమ విషయం చెప్పారు. సినిమాల తరహాలో ట్విస్ట్ లు లేకుండా వారు కూడా పిల్లల పెళ్లి కి అంగీకారం తెలిపారు. దీంతో...హిందూ వివాహ సంప్రదాయ పద్దతిలో మూడు ముళ్ల బంధంతో... ఆంధ్రా అబ్బాయి.. ఆఫ్ఘనిస్తాన్ అమ్మాయి ఒక్కటయ్యారు. ఆమె తనకు నచ్చిందని.. ఇద్దరి ప్రేమ ను ఇంట్లో వాళ్లు కూడా అంగీకరించి పెళ్లి చేయడం ఆనందంగా ఉందని వరుడు వివేకానంద రామన్ చెప్పారు.