Vijayasai Reddy: ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతున్న విజయసాయి క్యాపిటల్ కామెంట్స్

Vijayasai Reddy: ఓ వైపు వరుస ప్రమాదాలు మరోవైపు ఉద్యమాలు, ఆందోళనలు ఇలాంటి సమయంలో అధాకార పార్టీ ఎంపీ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి.

Update: 2021-06-06 06:30 GMT

విజయసాయిరెడ్డి(ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Vijayasai Reddy: ఓ వైపు వరుస ప్రమాదాలు మరోవైపు ఉద్యమాలు, ఆందోళనలు ఇలాంటి సమయంలో అధాకార పార్టీ ఎంపీ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో హీట్ పుట్టిస్తున్నాయి. త్వరలోనే స్టీల్‌ సిటీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానుందా..? ఎంపీ విజయసాయి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..? క్యాపిటల్ కామెంట్స్‌పై విపక్షాలు ఏమంటున్నాయి..?

సీఆర్డీఏ కేసుతో సంబంధమే లేదు త్వరలోనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖకు వచ్చి తీరుతుంది ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించొచ్చు. ఇవీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కామెంట్స్.! ప్రస్తుతం ఈ క్యాపిటల్ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం విజయసాయి వ్యాఖ్యలపై సీరియస్ అయింది. విశాఖలో విలువైన భూములు కాపాడుకునేందుకే వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఫైర్ అవుతోంది.

కొద్దిరోజుల్లో విశాఖ నుంచే పాలన జరుగుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు వస్తుందని ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుందన్నారు. సీఆర్డీఏ కేసుతో రాజధాని తరలింపునకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేయొచ్చని ఎంపీ అన్నారు. అయితే, విజయసాయి వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఫైర్ అవుతుంది. అమరావతి రైతుల ఆందోళనలు అధికార పార్టీకి పట్టడం లేదా అని ప్రశ్నలు కురిపించింది. విశాఖలో ఉన్న విలువైన భూములు కాపాడుకునేందుకే ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని తెలుగు తమ్ముళ్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

మరోవైపు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ప్రకటించిన దగ్గరనుంచీ నగరంలో ఏదో ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ పరిపాలనా రాజధానిగా ఎంతవరకూ సేఫ్ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొన్నటి ఎల్జీ పాలిమర్స్ ఘటన నుంచి తాజాగా హెచ్‌పీసీఎల్ ప్రమాదం వరకూ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసినవే ఈ ప్రమాదాలతో తమ భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నది వామపక్షనాయకుల మాట.

ఓ వైపు కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ క్యాపిటల్ కహానీ అవసరమా అన్న వాదనలూ ఎక్కువయ్యాయి. విశాఖలో వందల కొద్దీ పాజిటివ్ కేసులు నమోదవుతుంటే కరోనా కట్టడిపై దృష్టిపెట్టాల్సింది పోయి. రాజధాని కోసం మాట్లాడడం ఎంతవరకూ సబబని వామపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాజధాని అంశాన్ని పక్కనపెట్టి కరోనా కట్టడికి కృషి చేయాలంటున్నారు. ఓ వైపు సీఆర్డీఏ కేసు కోర్టులో ఉండగానే విజయసాయి క్యాపిటల్ కామెంట్స్ పొలిటికల్ హీట్‌కు కారణమవుతున్నాయి. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో రాజకీయాలు పక్కనపెట్టి కరోనా నుంచి ప్రజలను కాపాడడంపై దృష్టిపెట్టాలని విపక్షాలు సూచిస్తున్నాయి.

Full View


Tags:    

Similar News