Vasantha Krishna Prasad: రెండు మూడు రోజుల్లో టీడీపీలో చేరుతా.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే
Vasantha Krishna Prasad: అదే బాటలో నియోజకవర్గానికి చెందిన మరికొందరు కీలక నేతలు
Vasantha Krishna Prasad: మైలవరం టికెట్ పంచాయతీ లైన్ క్లియర్ కావడంతో.. వసంత కృష్ణ ప్రసాద్ దూకుడు పెంచారు. త్వరలోనే టీడీపీలో చేరటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు ప్రకటించారు. తన వల్ల మైలవరంలోని టీడీపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా..చూసుకుంటానని వసంత కృష్ణ ప్రసాద్ మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. టీడీపీలో జాయిన్ తర్వాత నియోజకవర్గంలో ప్రచారానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యలోనే కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లు వసంతకృష్ణ ప్రసాద్ ను కలవడానికి క్యూ కడుతున్నారు. వీరితోపాటు నియోజకవర్గంలోని పలువురు కీలక నేతలు కూడా ఇదే బాటలో ఉన్నట్టు తెలుస్తుంది.