V Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కేటుగాళ్ల ఫోన్

V Hanumantha Rao: ఫేక్‌ అని తేలడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు

Update: 2023-10-06 10:17 GMT

V Hanumantha Rao: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు కేటుగాళ్ల ఫోన్‌

V Hanumantha Rao: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు సైబర్‌ నేరగాళ్లు వల వేశారు. హరిరామజోగయ్య పేరిట బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. అన్‌నౌన్‌ నెంబర్‌ నుంచి హరిరామజోగయ్య పేరుతో వీహెచ్‌కు ఫేక్‌ కాల్‌ చేసిన ఓ కేటుగాడు.. ఆపదలో ఉన్నా.. అర్జెంట్‌గా డబ్బులు పంపాలని కోరాడు. మరో ఫోన్‌ నెంబర్‌ పంపి ఆ నెంబర్‌కు గూగుల్‌ పే చేయాలని విజ్ఞప్తి చేశాడు. అయితే.. ఆ మొబైల్‌ నెంబర్ హరిరామజోగయ్యది కాకపోవడంతో.. నేరుగా ఓ వ్యక్తిని ఆయన ఇంటికి పంపి విచారణ చేశారు వీహెచ్‌. అది ఫేక్‌ కాల్‌ అని తేలడంతో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఖమ్మం నుంచి ఫోన్‌ వచ్చినట్టు వెస్ట్‌ గోదావరి ఎస్పీ చెప్పడంతో.. ఖమ్మం ఎస్పీ, సైబరాబాద్‌ పోలీస్‌లకు వీహెచ్‌ ఫిర్యాదు చేశారు. అయితే.. గతంలో కూడా జానారెడ్డి, సృజనా చౌదరి పేరుతో తనకు ఇలాంటి ఫేక్‌ కాల్స్‌ వచ్చాయని, ప్రభుత్వం సైబర్‌ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్‌ చేశారు వీహెచ్.

Tags:    

Similar News