కోటపై ముందు వరుస నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు : ఊర్మిళ

Update: 2020-10-29 09:10 GMT

మాన్సాస్‌ తన సొంత సంస్థలా సంచయిత వ్యవహరిస్తున్నారని అన్నారు ఊర్మిళ గజపతిరాజు. సిరిమానోత్సవంలో తమను అవమానించారని.. కోటపై ముందు వరస నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని అన్నారు. అసలు కోటలోకి ఎవరు అనుమతించారంటూ సిబ్బందిని సంచయిత నిలదీశారన్నారు. ఈవోని బ్రతిమాలుకొని కొంతసేపు అక్కడే కూర్చొని ఒకసారి సిరిమానును దర్శించుకుని వచ్చేశాం. ఇలాంటి ఘటన జరుగుతుందని ముందే ఊహించాం.

అధికారంలో ఉన్న సమయంలో మా తాత, తండ్రి ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. సంచయిత అహంకార పూరితంగా వ్యవహరిస్తోంది. మాన్సాస్‌ ట్రస్టు బోర్డు మెంబర్‌గా కూడా మా అమ్మను ప్రమాణ స్వీకారం చేయనివ్వలేదు. ఈ విషయమై అనేకసార్లు మెయిల్స్‌ చేసి ప్రమాణ స్వీకారం కోసం కోరాం. అయినప్పటికీ వారి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు అని ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అశోక్‌గజపతిని కలిసి సహకరించాలని కోరినప్పటికీ స్పందించలేదన్నారు. తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే ప్రశ్నిస్తున్నామని ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. మాన్సాస్‌పై చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని.. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు. మాన్సాస్‌లో జరుగుతున్న పరిణామాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Tags:    

Similar News