Uppada: ఉప్పాడ వద్ద తీరానికి తూట్లు.. బండరాళ్లు, సిమెంట్ దిమ్మలు వేసినా..

Uppada Beach Road: చిన్నపాటి కెరటాలకే తీరం కొట్టుకుపోతుందంటున్న స్థానికులు

Update: 2023-07-09 14:30 GMT

Uppada: ఉప్పాడ వద్ద తీరానికి తూట్లు.. బండరాళ్లు, సిమెంట్ దిమ్మలు వేసినా.. 

Uppada Beach Road: తుపానులు,అల్పపీడనాల సమయంలో అలల ఉధృతితో సముద్ర తీరానికి తూట్లు పడుతోంది. కాకినాడ జిల్లా. కొత్తపల్లి మండలం ఉప్పాడ వద్ద ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు సుమారు 15 కిలోమీటర్ల పొడవునా బీచ్‌ రోడ్డు ఉంది. మాయాపట్నం నుంచి కాకినాడ వైపు బీచ్‌ రోడ్డు వైపు సుమారు ఒక కిలోమీటరు పొడవున సమద్రకోత నివారణకు బండరాళ్లు, రెండు వేల సిమెంటు దిమ్మలు డంప్‌ చేశారు. అయినా, సముద్ర కోతను అడ్డుకోలేకపోయారు. దీంతో, చిన్నపాటి కెరటాలకే ఉప్పాడ - కాకినాడ బీచ్‌రోడ్డు ఛిద్రమవుతోంది.

Tags:    

Similar News