Vizag Steel Plant: ఏపీ స‌ర్కారు ముందుకొస్తే ఆలోచిస్తాం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2021-03-14 08:29 GMT

కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో )

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంలో ఏపీ వ్యాప్తంగా నిరసలు కొనసాగుతున్నాయి. బీజేపీ తీరుపై అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ స‌హాయ‌ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు ప‌రిశ్ర‌మ‌ల‌ కోసం ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హ‌క్కు ప్ర‌తి ఒక్క‌రికీ ఉంద‌ని చెప్పారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. నష్టాల్లో కొన‌సాగుతోన్న విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను నడపడం భారమని చెప్పుకొచ్చారు. ఒక వేళ‌ స్టీల్‌ప్లాంట్‌ను త‌మ ప‌రిధిలోకి తీసుకోవడానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం ముందుకొస్తే ఆ విష‌యంపై కేంద్ర స‌ర్కారు ఆలోచిస్తుంద‌ని కిషన్ రెడ్డి అన్నారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతోంది. ప్రైవేటీకరణ మంత్రంలో భాగంగా స్ట్రాటజికల్ సేల్ పేరుతో వాటాలను విక్రయించేందుకు సిద్ధం అవుతోంది. దీంతో 35 వేల మందికి ప్రత్యేక్షంగా లక్ష మంది పరోక్షంగానూ ఆదారఫడ్డ పరిశ్రమ భవిష్యత్తుపై కార్మిక వర్గాల్లో అలజడి మొదలైంది.ఈ పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంది భవిష్యత్ తరాల కోసం చేసిన బలిదానాలు కేంద్రం ప్రభుత్వ నిర్ణయంతో గాలిలో కలిసిపోతున్నాయి. ప్రయిడ్ ఆఫ్ ఇండియా అంటూ ఓ వెలుగు వెలిగిన ఈ భారీ పరిశ్రమ ఇక ప్రైవేట్‌పరం కానుంది. స్ట్రాటజిక్ సేల్ పేరుతో స్టీల్ ప్లాంట్ వాటాలను విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది ఈ చర్య లక్షలాది మంది జీవితాలకు శరాఘాతంగా మారుతుందనే ఆందోళన కార్మిక వర్గాల్లో మొదలైంది.

Tags:    

Similar News