Telugu Akademi Case: తెలుగు అకాడమీ కేసులో దర్యాప్తు ముమ్మరం
*ప్రైవేట్ వ్యక్తుల ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా కొట్టేసినట్టు అనుమానం *అకాడమీకి చెందిన రూ. 63 కోట్లు కాజేసిన ముఠా
Telugu Akademi Case: తెలుగు అకాడమీ కేసులో తవ్వేకొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కేసులో కీలక నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తెలుగు అకాడమీ డబ్బులతో పాటు ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను కూడా ముఠా కొట్టేసినట్టు అనుమానిస్తున్నారు. అకాడమీకి చెందిన 63 కోట్లు కొట్టేసింది ఈ ముఠా నకిలీ పత్రాలు, ఫేక్ ఐడీలు, ఫోర్జరీ సంతకాలతో నిధులు కాజేశారు.
ఏపీ మార్కైంటైల్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటితో పాటు యూనియన్ బ్యాంకు మేనేజర్‌లదే కీలక పాత్రగా గుర్తించారు అసలు సూత్రదారులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ స్కాంలో ఏ1 మస్తాన్ వలీ బ్యాంకు మేనేజర్, ఏ3 సొసైటీ చైర్మన్ సత్యనారాయణ, ఏ4 పద్మావతి, ఏ5 మొహినుద్దీన్‌లను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏ2గా ఉన్న రాజ్‌కుమార్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.