Tirupati: శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అపశ్రుతి

Tirupati: సెగ్మెంట్ కింది పడి ఇద్దరు కార్మికులు మృత్యువాత

Update: 2023-07-27 04:13 GMT

Tirupati: శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అపశ్రుతి

Tirupati: తిరుపతిలో జరుగుతున్న శ్రీనివాస సేతు నిర్మాణ పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రిలయన్స్ మార్టు సమీపంలో రైల్వే వంతెన వద్ద గత అర్థరాత్రి 11.45 గంటలకు క్రేన్తో గడ్డర్ సెగ్మెంట్ను తరలిస్తున్నారు. ఈ సందర్భంగా సెగ్మెంట్కు కింద కార్మికుల బోల్టులు బిగిస్తుండగా జారి కిందపడింది. ఈ పనుల్లో నిమగ్నమైన పశ్చిమబెంగాల్ కు చెందిన అబిజిత్ ఘోష్ , బిహార్ రాష్ట్రానికి చెందిన బుద్ధా మంఢల్ గడ్డరు సెగ్మెంట్ కిందపడి దుర్మరణం చెందారు. బావ మృతితో తన చెల్లికి ఏం సమాధానం చెప్పాలో తెలియడంలేదని బుద్ధా మండల్ బావమరిది అమరీ విలపించారు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను ఎస్వీ వైద్య కళాశాలకు తరలించారు.

Tags:    

Similar News